బర్కత్పుర, జూలై 29 రాయల్ పోస్ట్ న్యూస్ /
హైదరాబాద్ లోని బర్కత్పుర శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల అధికార స్వీకార వేడుకలు (ఇన్వెస్టిచర్ సెర్మనీ) అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వివిధ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. తద్వారా వారిలో బాధ్యతా భావం, నైతిక విలువలు మరియు సేవా దృక్పథాన్ని పెంపొందించేందుకు చక్కటి వేదిక కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాచిగూడ ఎస్.ఐ. రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులంతా భవిష్యత్తులో ఉత్తమ నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. నాయకత్వం అనేది కేవలం ఒక పదవి కాదని, అది ఒక గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు ఎల్లప్పుడూ నైతికతతో, నిజాయితీతో నడుచుకుంటే సమాజంలో గొప్ప నాయకులుగా రాణించగలరని ఉద్బోధించారు.
ఈ వేడుకల్లో భాగంగా నూతన నాయకత్వ బాధ్యతలు చేపట్టిన విద్యార్థులకు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నారాయణగూడ ఏజీఎం నూర్ మొహమ్మద్ అలీ, ఆర్ఐ బండి వెంకటేష్, అకాడమిక్ కోఆర్డినేటర్ డి. రాజేంద్ర ప్రసాద్, ప్రిన్సిపాల్ ఆకుల మాధవి దేవి, డీన్ గాయత్రి , సిఇన్చార్జ్ వెంకటేష్, ప్రైమరీ ఇన్చార్జ్ ఎస్. సబిత, ప్రీ-ప్రైమరీ ఇన్చార్జ్ మాలతి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

