శంకర్ పల్లి; జూన్ 19.(రాయల్ పోస్ట్) శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామంలో ఐదున్నర కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్ల పనులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొద్దుటూరు గ్రామం నుండి తంగడపల్లి రోడ్డు వరకు ఈ రోడ్డు చాలా అద్వానంగా మారిందని అందుకోసం ఈ రోడ్లను శాశ్వతంగా సిసి రోడ్లుగా మారుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నదని తెలిపారు. గ్రామాలలో కావలసిన మౌలిక సదుపాయాలపై తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండ లక్ష్మీ నరసింహ, పిసిసి సెక్రెటరీ కె. ఉదయ మోహన్ రెడ్డి, శంకర్ పల్లి పిఎసిఎస్ మాజీ చైర్మన్ బి. మోహన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి బొల్లారం వెంకటరెడ్డి, ఎంపీడీవో వి. ప్రవీణ్ కుమార్, ఎంపీ ఓ గిరిరాజు, ఏపీవో నాగభూషణం, మాజీ సర్పంచ్ కె. శ్రీనివాస్, నాయకులు కె. జంగారెడ్డి, కాంతి రెడ్డి, మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గం, పలు గ్రామాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
