రాయల్ పోస్ట్ న్యూస్ : యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జులై 12/
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం, వంగపల్లిలో ఆదివారం హ్యామ్ ప్యాకేజీ-1లో భాగంగా 358.18 కోట్ల వ్యయంతో నిర్మించే 210 కి.మీ,*
*4 రోడ్ల, అభివృద్ధి పైలాన్ పనులకు రాష్ట్ర రహదారులు మరియు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు
బీర్ల ఐలయ్య , భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి , యమ్ఎల్సి నెల్లి కంటి సత్యం,భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి,పాలకుర్తి శాసన సభ్యులు యశస్విని రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో
మంత్రి మాట్లాడుతూ ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఆలేరు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మరింత మెరుగుపడి ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందే విధంగా చూడడం జరిగింది . రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, మరిన్ని అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
రాష్ట ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందన్నారు, పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని, పేద విద్యార్థులు ఉన్నత స్థానం ఎదగడానికి ప్రభుత్వ పాఠశాలలో అనేక సదుపాయాలు ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి అధిగమించేలా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు ప్రజలకు హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు , ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు