డ్రైనేజీ సమస్యను పరిశీలించిన భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 22/ భువనగిరి పట్టణంలో ప్రధాన రహదారి బ్రహ్మంగారి దేవాలయం వద్ద డ్రైనేజీ పొంగిపొర్లుతుందని ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ఆకస్మికంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

డ్రైనేజీలో పూడిక, చెత్త పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని గుర్తించారు. వెంటనే మున్సిపల్ సిబ్బందితో డ్రైనేజీని పూర్తిగా శుభ్రం చేయించాలని, పూడిక తీయించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. దోమల బెడద, దుర్వాసన రాకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ప్రజలు కూడా చెత్తను డ్రైనేజీలో వేయకుండా సహకరించాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ శ్రీ జాలిగం విగ్నేష్ , అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article