రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాయల్ పోస్ట్ న్యూస్ : యాదాద్రి భువనగిరి జిల్లా జులై 12/
ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రహదారులు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా
రామన్నపేట మండల కేంద్రంలో ఆదివారం స్టేజ్–1, ప్యాకేజ్–2/7లో భాగంగా రూ.339.59 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 109.3 కిలోమీటర్ల పొడవైన రహదారుల అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి నుండి చిట్యాల వరకు కలిగి ఉన్న రహదారిని 4 లేన్లుగా విస్తరింప చేసేందుకు చేపట్టాల్సిన నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,తో పాటు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టడంకోసం ఈ ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని అన్నారు.
రహదారి పనులు పూర్తయితే జిల్లాలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయంతగ్గి, ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని అన్నారు. దశాబ్దాలుగా ఎన్నికల్లో ఉన్న రహదారి సమస్యలను ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చెబుతుందని తెలిపారు.
274.79 కోట్ల రూపాయలతో మూడు ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి ఒకటిగా అమలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు.
వలిగొండ, ఇలువర్తి, పోచంపల్లి, చౌటుప్పల రహదారులతోపాటు, బీబీనగర్ వెంకిర్యాల రహదారి, చిన్న రావులపల్లి వెంకిర్యాల రహదారి, రేపాక వీరవెల్లి, రహదారులని యాదాద్రి జిల్లా అభివృద్ధి కి
దోహదపడుతుందని అన్నారు
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు..

📄 Generate e-Paper Clip
Share This Article