రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి సెప్టెంబర్ 10/ ఈనెల 7వ తేదీ రోజున కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఎదుట చావు డప్పు కొట్టడానికి వేలాది సంఖ్యలో కాంగ్రెస్ పార్ట్ సైనికులు మరియు దళితులు వెళ్లడం జరిగింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారిని వారి తల్లి గారిని అవమానించినటువంటి తాత మధు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. కానీ బిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పును ఒప్పుకోకుండా ఆ పార్టీ ఎమ్మెల్సీ ని వెనుకేసుకొస్తూ యావత్తు దళిత జాతిని అవమానించదమే కాకుండా ఎర్రవెల్లి బిఆర్ఎస్ నాయకులు, అది దళితులు తిరిగిన నేల అని దీనిని వెంటనే శుద్ధి చేయాలని ఒక కార్యక్రమం చేపట్టి యావత్తు దళిత జాతిని మరోసారి వాళ్లు అవమానపరిచి తీవ్ర మనోవేదనకు గురి చేయడం జరిగింది.

కావున అట్టి వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారికి చట్టరీత్యా శిక్ష పడేలా చేయాలని భోనగిరి పట్టణ సిఐ గారికి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగారం శంకర్, కొండాపురం పాల్ తదితరులు పాల్గొన్నారు.