గజ్వేల్ చేనేత సహకార సంఘం ఎన్నికలు పూర్తి 

గజ్వేల్, 10 జూలై 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /

తెలంగాణ రాష్ట్రవ్యాప్త సహకార ఎన్నికల్లో భాగంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ చేనేత సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ సంఘంలో మొత్తం 236 ఓట్లు ఉండగా, 211 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 13 ఓట్లను చెల్లని ఓట్లుగా అధికారులు పరిగణించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మొత్తం 25 మంది నామినేషన్లు వేయగా, నలుగురి నామినేషన్లను ఉపసంహరించుకోవడం/తిరస్కరించడం జరిగిందన్నారు. చివరికి 18 మంది పురుషులు, ముగ్గురు మహిళలు కలిపి మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని తెలిపారు. మొత్తం 9 మంది డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలను ఆయన అధికారికంగా ప్రకటించారు.విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు 1. అమృత మహిళా డైరెక్టర్(165), 2. స్వర్గం రాజేశం డైరెక్టర్(134), 3. ఎలగందుల రామచంద్రం డైరెక్టర్ (118), 4. గాడిపల్లి విజయకు డైరెక్టర్ (116), 5. గాడిపల్లి శ్రీనివాస్ డైరెక్టర్(113), 6. జిల్లా భాగ్యలక్ష్మి మహిళా డైరెక్టర్ (102), 7. వల్లందాస్ సత్యనారాయణ  డైరెక్టర్ (95), 8. దొంతుల ప్రసాద్ డైరెక్టర్ (87), 9. చెప్పాల మల్లేశం డైరెక్టర్ (86) రేపు ఉదయం చైర్మన్ ఎన్నిక, ఎన్నికైన డైరెక్టర్లందరూ రేపు (శనివారం) ఉదయం 9:00 గంటలకల్లా పట్టణంలోని చేనేత సహకార సంఘం కార్యాలయానికి చేరుకోవాలని అసిస్టెంట్ ఎన్నికల అధికారి కోరారు. అక్కడ డైరెక్టర్లందరితో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం… చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ ఎన్నికల ప్రక్రియ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ ఓట్ల లెక్కింపు మరియు ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ అధికారులు వి. శ్రీనివాస్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ పి. నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ ఎడిఓ టి. అంజయ్య, బాలయ్య, పి.ఎ.సి.ఎస్ సెక్రటరీలు పాల్గొని ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article