రూ.2.75 కోట్లతో నూతన మార్కెట్ గోదాం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి…

oplus_2097152

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 10/భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో భువనగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో రూ.2.75 కోట్ల వ్యయంతో 2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల నూతన మార్కెట్ గోదాం నిర్మాణ పనులకు భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ శ్రీమతి రేఖా బాబురావు పూజా కార్యక్రమంలో పాల్గొనగా, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గారు మాట్లాడారు.

రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు ఎంతో శ్రమించి పండించిన ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు ఈ నూతన గోదాం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సరైన నిల్వ సదుపాయాలు లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆధునిక గోదాముల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఈ గోదాం నిర్మాణం పూర్తయిన తర్వాత 2,500 మెట్రిక్ టన్నుల వరకు వ్యవసాయ ఉత్పత్తులను శాస్త్రీయ పద్ధతిలో నిల్వ ఉంచే అవకాశం కలుగుతుందని, దీని ద్వారా రైతులకు నాణ్యమైన నిల్వ సదుపాయం అందడంతో పాటు మార్కెట్‌లో అనుకూల ధర లభించే వరకు తమ పంటలను భద్రపరచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ గోదాం గూడూరు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు.

వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ ముందుకు సాగుతోందన్నారు. సాగునీరు, గోదాములు, మార్కెట్ యార్డుల అభివృద్ధి, రైతులకు అవసరమైన సదుపాయాల కల్పన వంటి అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ శ్రీమతి రేఖా బాబురావు గారు, PACS ఛైర్మన్లు , వైస్ ఛైర్మన్లు , డైరెక్టర్లు, భువనగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు , మండల మరియు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, వార్డు సభ్యులు, యార్డ్ కమిటీ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

📄 Generate e-Paper Clip
Share This Article