700 సర్వే నెంబర్లు అర్హులందరికీ వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ…

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 2// 700 సర్వే నెంబర్లు అందరికీ ఇళ్ల స్థలాల లో ఇల్లు కట్టేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని వారందరికీ ఇల్లు కట్టిస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. 700 సర్వే నెంబర్లు 2005లో పట్టాలి ఇచ్చి 21 సంవత్సరం అవుతున్న ఇళ్ల స్థలాలు చూపించకుండా ప్రభుత్వము అధికారులు కాలయాపన చేస్తున్నారు అనేకసార్లు అధికారులకు స్థానిక ఎమ్మెల్యే కు పలుమార్లు అనేక వినతి పత్రాలు ఇచ్చినాం. స్థానిక ఎమ్మెల్యే ఫోన్లో ఎమ్మార్వో తో మాట్లాడి ప్రభుత్వ స్థలాన్ని మొత్తం ఎంత ఉందో చూసి ఫినిషింగ్ చేయాలని వాటి అయ్యే ఖర్చులు ఎమ్మెల్యే కోటా కింద ఇస్తానని అధికారులతో మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది అయినా సర్వే చేసి హద్దులు మాత్రమే చేసినారు ఆ భూమిని చదును చేసి ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది పది రోజులలో అర్హులైన వారందరికీ భూమిని చదును చేసి ప్లాట్లు ఇవ్వాలని లేని పక్షంలో మరొకసారి గుడిసెలు వేస్తామని 700 సర్వే నెంబర్ దగ్గర్నే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వంట వార్పు చేయడం జరిగింది. వచ్చిన వారందరూ భోజనాలు చేసి ఇక్కడనే స్థలాలు ఇచ్చిన కట్టించాలని ప్రజలు కోరారు. ఇప్పటికైనా అధికారులు గానీ స్థానిక ఎమ్మెల్యే గాని అధికారం ప్రభుత్వం గానీ స్పందించి వారికి తగు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, పట్టణ నాయకులు గంధమల మాతయ్య, వోల్దాస్ అంజయ్య, బర్ల వెంకటేష్ కొత్త లక్ష్మయ్య, నరాల నరసింహ, దొడ్డి శంకర్, సత్తిబాబు, కొత్త లలిత, నార కళమ్మ, వరమ్మ, ఇక్కుర్తి కళావతి, రంగాపురం రేణుక, వసుంధర సుమతి, గౌసియా బేగం, అరిఫ్ఫా బేగం, ఆడెపు మౌనిక, తులసి. తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article