కెరీర్, పోటీ పరీక్షలు, వ్యక్తిత్వ వికాసంపై నిపుణుల సూచనలు
ఉద్యోగ అవకాశాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్లపై విలువైన సమాచారం
వరంగల్, ఆగస్టు 18 రాయల్ పోస్ట్ న్యూస్ /
విద్యార్థులు చదువులోనే కాకుండా జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఎన్‌ఐటీ వరంగల్ రిటైర్డ్ సీనియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ దంతాల దినకర్ అన్నారు. బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సీనియర్ సెకండరీ విద్యార్థుల కోసం నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బిర్లా విద్యాసంస్థల చైర్మన్ చైర్మన్ డా. నడిపెల్లి వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్య అవకాశాలు, వివిధ కోర్సులు, ప్రవేశ పరీక్షల విధానం, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పద్ధతులు, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. సమయపాలన, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని సూచించారు.
వైఫల్యాలను భయపడకుండా వాటిని అనుభవాలుగా మలుచుకుని ముందుకు సాగాలని, విజ్ఞానంతో పాటు విలువలను కూడా అలవర్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఫిజిక్స్‌లోని కీలక అంశాలను సులభంగా బోధించడం ద్వారా విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రొఫెసర్ దినకర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

