శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జెవివి కృషి ప్రశంసనీయం– జిల్లా విద్యాశాఖ అధికారి బి. బిక్షపతి

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 10/శుక్రవారం భువనగిరిలో డీఈఓ ఆఫీసులో జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ” నేను ఆడపిల్లను ” అనే వాల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతరం బిక్షపతి మాట్లాడుతూ శాస్త్రజ్ఞానం ద్వారా మూఢవిశ్వాసాలను అశాస్త్రీయ భావాలను ఎండకట్టడంతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక మౌలిక స్వభావాలను గూర్చి సమగ్రమైన శాస్త్రీయ అవగాహనను పెంపొందించడం, వాటికి పరిష్కారాలను అన్వేషించడంలో జె వి వి కృషి బాగుందని అన్నారు. ప్రకృతి పానీయాలను సేవించాలని, కాలుష్య నియంత్రణ ఉండాలని ప్లాస్టిక్ వ్యతిరేక పోరాటాలు జీవవైద్యాన్ని కాపాడుకోవడం కోసం విశేష కృషి చేస్తుందని తెలిపారు. ప్రజల కోసం సైన్సు, ప్రగతి కోసం సైన్స్ సాలంబలం కోసం సైన్స్ అనే ఆశలతో జనవిజ్ఞాన వేదిక ముందుకు వెళ్తుందని అన్నారు. దీంతోపాటు సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు పారదోలుటకు కూడా కృషి చేస్తుందని అన్నారు. నేను ఆడపిల్లను అందుకే నేను తప్పక చదవాలి అనే వాల్ క్యాలెండర్ కు విశేష స్పందన లభించిందని ఆడపిల్లలు చదువుకోవాలనే జనవిజ్ఞాన వేదిక చేస్తున్న ప్రయత్నం అభినందినీయం. మీరు నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ విద్యార్థుల్ని ఆకట్టుకుంటున్నాయని అన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చెకుముకి, సైన్స్ టాలెంట్ టెస్ట్ లు నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. జనవిజ్ఞాన వేదిక అనునిత్యం ప్రజల్లో, విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని, మాసైన్స్ సంస్థ అభివృద్ధికి మీ అందరి సహకారాలు కావాలని మా సంస్థలో సభ్యులుగా చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షులు కే. అమరేందర్, జి సి డి ఓ రాధ, సెక్టోరల్ ఆఫీసర్స్ నాగిరెడ్డి, అయ్యంగార్, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు కరుణాకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article