ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్‌తో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చర్చ

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ ఉప్పల్ ఆగస్ట్ఇం 11/దిరమ్మ ఇళ్ల పథకం అమలు, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు తదితర అంశాలపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గారిని కలిశారు.

ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల మంజూరు ప్రక్రియ, పెండింగ్‌లో ఉన్న అంశాలపై కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారు చర్చించారు.

అనంతరం సచివాలయంలో సంబంధిత అధికారులతో కూడా ఇందిరమ్మ ఇళ్ల అంశంపై చర్చించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు కోరారు.

📄 Generate e-Paper Clip
Share This Article