ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలి……..గొర్రెల మేకల పెంపకార్ల సంఘం జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ…

Fasiuddin Mohammed
2 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 16/ఆగస్ట్ 16, అనాజిపురం వీరవెల్లి రాయగిరి , భువనగిరి మండలం .నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రవేశపెట్టి సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేయాలని
గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని అనాజిపురం, నాగిరెడ్డిపల్లి, వీరవెల్లి, రాయగిరి గ్రామాలలో
4 వ రాష్ట్ర మహాసభ ఆగస్టు 22, 23, 24 తేదీలలో చెంగిచెర్లలో
జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించి, జీఎంపీఎస్ సంఘం జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గొర్రెల మేకల పెంకుందారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తయిందని ఈ సందర్భంగా నిర్వహించే 4 వ రాష్ట్ర మహాసభలు ఆగస్టు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెంగచెర్ల లో నిర్వహిస్తున్నామని అన్నారు. 1995 సంవత్సరంలో సంఘం ఏర్పడిందని, వాటి నుంచి నేటి వరకు అనేక పోరాటాలు చేసి, ముఖ్యంగా తుమ్మ చెట్లపై గొర్ల కాపరులకు హక్కు కల్పించే 1016 జీవో, మేతకు ప్రభుత్వ భూములు కేటాయించాలని 559 జీవో సాధించినట్లు తెలిపారు. గొర్రెలకు ఉచితంగా మందులు పంపిణీ చేసేందుకు కృషి చేసిందన్నారు.
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో గొల్ల, కురుమ యువతకు గొర్ల ఫామ్ షెడ్, గొర్రెల కొనుగోలు కోసం నేషనల్ లైవ్ స్టాక్ లో ప్రత్యేకంగా రాయితీ కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపందారుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దేవునూరి బాలయ్య, పాక జహంగీర్,
జిల్లా సహాయ కార్యదర్శి ఎల్లంల సత్యనారాయణ, గంగనబోయిన పాండు, కడారి కృష్ణ, దయ్యాల మహేష్, తెలజురి రాములు యాదవ్, రేగు మహేష్, తోటకూర అశోక్, జెట్టా శ్రీనివాస్, మోటే ఉప్పలయ్య, రేగు శ్రీశైలం,
కడారి పోషాలు,
మన్నెబోయిన రాజలింగం, కొత్త శ్రీశైలం, చిన్న మల్లయ్య, మల్లె బోయిన బాలరాజు, బాత్కా అశోక్, శ్రీరామ్ శరత్,
ముద్ద మారయ్య, కొత్త మల్లేష్, గుండెబోయిన శ్రీశైలం, ఐలయ్య, వెంకటేష్, అలివేలు, పద్మ, లక్ష్మి
గొర్ల కాపరులు
లు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article