రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 16/ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత – జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పిలుపునిచ్చారు.
23వ వార్డు పరిధిలోని వివిధ కాలనీల్లో నివసిస్తున్న అర్హులైన బీసీ మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వం రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్ను 100 శాతం సబ్సిడీపై ఉచితంగా అందించడం ద్వారా మహిళలకు ఇంటి వద్దే ఉపాధి కల్పించే దిశగా కీలక అడుగు వేసిందన్నారు. కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని కోరారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్లు, గృహజ్యోతి, స్మార్ట్ రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పూజిత జహంగీర్ తెలిపారు. పేదలు, మహిళలు, వృద్ధులు, నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకంతో మహిళలకు ఉపాధి – చేయూత పింఛన్తో వృద్ధులకు భరోసా – గృహజ్యోతితో విద్యుత్ భారానికి ఊరట – స్మార్ట్ రేషన్ కార్డుతో పేద కుటుంబాలకు నిత్యావసర భద్రత లభించేలా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆమె అన్నారు.
23వ వార్డులో అర్హత ఉన్న మహిళలు కుట్టు మిషన్ల పథకంతో పాటు తమకు వర్తించే ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవసరమైన పత్రాలతో సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ఒక్క కుటుంబం కూడా ప్రభుత్వ సంక్షేమానికి దూరం కాకుండా తన వంతు సహకారం అందిస్తానని కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ తెలిపారు వారి వెంట వార్డ్ ఆఫీసర్ బూక్య అనిల్ నాయక్, బర్రె క్రాంతి ఉన్నారు.

