త్రివర్ణ పతాకాన్ని అవమానించిన ప్రధాని మోడీ వెంటనే రాజీనామా చేయాలి: DCC ప్రధాన కార్యదర్శి ఎం.డి. మాజాహర్

Fasiuddin Mohammed
1 Min Read

ప్రధానమంత్రి దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్

త్రివర్ణ పతాకాన్ని అవమానించిన ప్రధాని మోడీ వెంటనే రాజీనామా చేయాలి: DCC ప్రధాన కార్యదర్శి ఎం.డి. మాజాహర్

ప్రధానమంత్రి దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 16/ దేశ జాతీయ పతాకాన్ని అవమానించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని DCC ప్రధాన కార్యదర్శి ఎం.డి. మాజాహర్ డిమాండ్ చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ఎగురవేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీ వ్యవహరించిన తీరు మన త్రివర్ణ పతాకాన్ని, జాతిపిత మహాత్మా గాంధీని తీవ్రంగా అవమానించేలా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ జెండా రంగులు, ప్రాధాన్యత కూడా తెలియని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తీవ్ర అరాచక, నిరంకుశ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. నీట్ (NEET) ఉద్యమంలో న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయించి, అక్రమ కేసులు బనాయించడం వారి దమనకాండకు నిదర్శనమని విమర్శించారు. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ నాయకులు రక్తం చిందించి అమరులయ్యారని, కానీ బిజెపికి చెందిన ఒక్క నాయకుడు కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనలేదని గుర్తుచేశారు.

దేశంలో యువతంతా కాంగ్రెస్ వైపే ఉందన్న ఆయన, రాబోయే రోజుల్లో బిజెపి వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. మోడీ, అమిత్ షాల ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్ధుడై పనిచేస్తాడని ఈ సందర్భంగా హెచ్చరించారు.

📄 Generate e-Paper Clip
Share This Article