రాయల్ పోస్ట్ న్యూస్ ఉప్పల్ ఆగస్ట్ 11/ చిల్కానగర్లోని మర్ల మైసమ్మ దేవాలయంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుడి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బండల నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంగళవారం ఆలయాన్ని సందర్శించి మర్ల మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై నాయకులతో ఎమ్మెల్యే చర్చించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు
పల్లె నర్సింగరావు, అంబాటి జగదీష్ ముదిరాజ్, జల్లి మోహన్ నేర్ధం భాస్కర్ గౌడ్, ముక్కాల రామకృష్ణ ముదిరాజ్, ఈరెల్లి రవీందర్ రెడ్డి, చేర్యాల శ్రీనివాస్, మాస శేఖర్ పల్లె రాజ్ కుమార్ గౌడ్, ఆకిటి బాల్రెడ్డి, శనిగరం తిరుమలేష్, ముక్కాల హరికృష్ణ ముదిరాజ్, ఫోటోల రాజు, గడ్డం పాపిరెడ్డి, సంతోష్ రెడ్డి, రామకృష్ణ, సుభద్ర, లక్ష్మి, అండాలు తదితరులు పాల్గొన్నారు.
