రాయల్ పోస్ట్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా జులై 16/ భువనగిరి మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ఆశ్రమంలో గురువారం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయిబాబా పై 8మంది సాయి వ్యతిరేకులు చేసిన విమర్శలను విని మేము చాలా బాధపడ్డాం ఎంతోమంది సాయి భక్తులు సాయి దేవాలయాల నిర్వాహకులు సమర్థవంతంగా సాయి వ్యతిరేకులకు బుద్ధి చెప్పలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు సాయి ప్రక్షాన నిలబడి దీటుగా శత ప్రశ్న శర సంధానం గ్రంథం రాసి స్థాయి వ్యతిరేకుల నోరు మూయించారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఒక్కరే ధైర్యంగా నిలబడి సాయి వ్యతిరేకు పై పోరాటం చేయడం మాకు చాలా సంతోషం అనిపించింది అని తెలిపారు అందుకే సాయి భక్తులమైన మేము కూడా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారికి తోడుగా రక్షణగా నిలబడి సాయి వ్యతిరేకులపై పోరాడుతామని కొంతమంది ఓయూ కాలేజీ విద్యార్థులు తెలిపారు ఈ సందర్భంగా మేము సామూహికంగా మహాపీఠానికి వచ్చి శ్రీ రమణానంద మహర్షి వారికి మా మద్దతు ప్రకటిస్తామని తెలిపాం సిద్ధ గురువు రమణానంద మహర్షి వారు మా మద్దతును ఆమోదించాలని సభా పూర్వకంగా కోరుతున్నాము అంతేకాకుండా ఎవరి ప్రభావానికి ఒత్తిడిలకు లోను కాకుండా మాకై మేము స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు ఇకనైనా సాయి వ్యతిరేకులారా వెంటనే శిరిడి సాయిబాబా పై చేసిన విమర్శలను అసత్యపు ప్రచారాలను మానుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్రంలో భారత దేశంలో సాయి భక్తులతో ధర్నాలు రాస్తారోకులు నిర్వహిస్తామని ఈ సందర్భంగా సాయి వ్యతిరేకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఓయూ కాలేజ్ నాయకులు ఆవుల మల్లేశం వేముల కొండల గౌడ్ మామిడాల రవికుమార్ వెంకటేష్ గౌడ్ నరిమెట్ట గురు పాలకుర్ల జానయ్య గౌడ్ ధీరజ్ శంకర్ ఎస్ నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు


