రాయల్ పోస్ట్ న్యూస్ వలిగొండ ఆగస్ట్ 11/ దివంగత సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ తుమ్మల నరసయ్య 3 వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఆయన స్వగ్రామమైన నరసయ్య గూడెం ఆరు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు ఈ రెండు గ్రామాలలో ఉన్న తుమ్మల నరసయ్య విగ్రహానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని సహదేవ్ మాట్లాడుతూ తుమ్మల నరసయ్య సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పార్టీ కోసం పని చేసి చివరి ప్రాణం పోయే వరకు కూడాకాంగ్రెస్ పార్టీ జెండాను వదలలేదని వారన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరిచిపోలేని మని ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని కోరారు ఆయన బ్రతికున్నంత కాలం నిరంతరం ప్రజల మధ్యనే ఉండి పార్టీకి నిస్వార్ధంగా సేవలందించాడని ఆయన చేసిన సేవలు ఏనాడు కూడా చెదిరిపోనివని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజు వలిగొండ సింగల్ విండో చైర్మన్ గరిసె రవి మత్స్యగిరి గుట్ట చైర్మన్ తుమ్మల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చెరుకు శివయ్య గౌడ్ వలిగొండ పట్టణ అధ్యక్షుడు పోలేపాక జానకి రాములునాయకులు చిట్టెడి జనార్దన్ రెడ్డి గంగాపురం సతీష్ కాసుల వెంకన్న గౌడ్ గుండు దానయ్య వలిగొండ సింగిల్ విండో వైస్ చైర్మన్ జంగారెడ్డి ఐటి పాముల రవీంద్ర బాల శంకర్ మచ్చ గిరి గుట్ట డైరెక్టర్లు రాధారపు రమేష్ కూర వెంకన్న జినుకల దానయ్య బండారు నరసింహారెడ్డి నరసయ్య కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
