సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై కృషి:… సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్.

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ సూర్యపేట ఆగస్ట్ 11/

  • సూర్యాపేట డివిజన్ స్థాయి అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం.
  • ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ఫిర్యాదులు, కేసులు పెండింగ్ ఉండొద్దు.
  • సిబ్బంది పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని డీఎస్పీ, సీఐలకు ఆదేశం.

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూర్యాపేట డివిజన్ స్థాయి పోలీసు అధికారుల నెలవారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలలో నమోదైన కేసుల తీరుతెన్నులు, పోలీసు దర్యాప్తు మరియు కేసుల పురోగతి స్థితిగతులను సమీక్షించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేయాలని స్పష్టం చేశారు. సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రణాళికతో పని చేస్తూ కృషి చేయాలని అన్నారు. మహిళల భద్రతలో ప్రాధాన్యం తో పని చేసి బాధితులకు త్వరగా సేవలు అందించాలని కోరారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, కేసులు ఏమాత్రం పెండింగ్‌లో ఉండొద్దు అని అధికారులను ఆదేశించారు. నేరాల అదుపునకు సాంకేతిక పద్ధతులను ఉపయోగించాలని, క్షేత్రస్థాయిలో సమాచారం ఇచ్చే వనరులను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సమాజంలో నేరాల నియంత్రణకు ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. డీఎస్పీలు, సీఐలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరుపై, సిబ్బంది విధి నిర్వహణపై నిరంతర క్షేత్ర స్థాయి పర్యవేక్షణ ఉంచాలని, సిబ్బందిని ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, డిసిఆర్బీ డీఎస్పీ రవి, డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ లు వెంకటయ్య, నాగేశ్వరరావు, ఉపేందర్ రావు, రాజశేఖర్, డివిజన్ ఎస్సైలు, టెక్నికల్ టీం ఎస్ఐ రాజశేఖర్ డిసిఆర్బీ ఎస్ఐ ఝాన్సి రాణీ, మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article