రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్ జులై 12/హైదరాబాద్, జూలై 12: విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నప్పుడే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.నరేష్ రెడ్డి అన్నారు. అవంతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం కాచిగూడ లోని మ్యాడం అంజయ్య హాల్ లో అవంతి విద్యా సంస్థల చైర్మన్, మాజీ మంత్రి ఎం.శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. కళాశాలలో చదివి ప్రస్తుతం ఉన్నత శిఖరాలను అధిరోహించిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పాత జ్ఞాపకాలను, అనుభవాలను తొటి విద్యార్థులతో ఉత్సాహంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుతం విద్యా, ఉపాధి రంగంలో నైపుణ్యాభివృద్ధి అనేది ఎంతో కీలకమైనదని విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు శోధనా సామర్ధ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్ బేస్డ్ విద్యను అందించే విధంగా ఓయు కృషి చేస్తుందని ఆయన అన్నారు. 35 సంవత్సరాలుగా విద్యాభివృద్ధికి, విద్యార్థుల పురోభివృద్ధికి అవంతి విద్యా సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.ప్రియాంక, డాక్టర్ ఎం.ఎ. హమీద్, సూరంపూడి సోనియా శ్రీకాంత్, ప్రొఫెసర్ ఇంద్రకంటి శేఖర్, జక్కుల సత్యనారాయణ, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ వై.జయప్రద, ప్రొఫెసర్ ఎస్.అప్పారావు, డాక్టర్ స్వాతి, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది. పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

