రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 3/ యాదాద్రి భువనగిరి జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో జిల్లా అధికారి రోజా రాణి ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా అధికారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ అధ్యక్షులు పోచం సోమయ్య, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి యాదగిరి లు మాట్లాడుతూ జిల్లాలో వినియోగదారుల సంఘాలను బలోపేతం చేయడానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సహకారం అందించాలని కోరారు. జిల్లాలో వినియోగదారులను చైతన్యం చేయడానికి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో వినియోగదారుల సభలు, చైతన్య సదస్సులు నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్ కొడారి వెంకటేష్, జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ ఉపాధ్యక్షులు ఎలిమినేటి నగేష్, దేవునిగూడెపు బాబు తదితరులు పాల్గొన్నారు.
