మత్స్యకారుల సంక్షేమానికి రూ.116 కోట్ల విడుదల….సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి డా. వాకాటి శ్రీహరి ముదిరాజ్ ల చిత్ర పటానికి పాలాభిషేకం

Fasiuddin Mohammed
1 Min Read

హైదరాబాద్, ఆగస్టు 3 రాయల్ పోస్ట్ న్యూస్ /

తెలంగాణ రాష్ట్ర ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బీసీ బిడ్డ, రాష్ట్ర మంత్రి డా. వాకాటి శ్రీహరి ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి, మత్స్యకార కుటుంబాల అభ్యున్నతినే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా తీసుకుని రూ.116 కోట్లను మత్స్యకారుల సంక్షేమం కోసం విడుదల చేయించడం పట్ల రాష్ట్రంలోని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రాష్ట్ర మంత్రి డా. వాకాటి శ్రీహరి ముదిరాజ్ లకు రాష్ట్రంలోని ప్రతి మత్స్యకారుడు కృతజ్ఞతలు తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భీమ లక్ష్మణ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.

అనంతరం హైదరాబాద్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే , రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రి డా. వాకాటి శ్రీహరి ముదిరాజ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి, మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ఆనందం వ్యక్తం చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article