రాయల్ పోస్ట్ న్యూస్ మేడిపల్లి ఆగస్ట్ 15/
మేడిపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల కుల సమైక్య మేడిపల్లి సంఘం ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గౌరవాన్ని చాటుకున్నారు.అనంతరం మేడిపల్లి గ్రామానికి చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) బద్ది దాసు పదవీ విరమణ సందర్భంగా సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఆయన రెవెన్యూ శాఖలో అందించిన సేవలను కొనియాడుతూ శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బద్ది దాసుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మేదరి ఆశీర్వాదం, మెట్టు విజయరావు, మెట్టు శ్రీనివాస్, మేకల రాజు, పెద్ద నరసయ్య, బద్ది అంజయ్య, మేదరి శ్యామ్, మెట్టు ప్రకాష్, చింతల మోహన్, దేవరాజ్, విద్యాసాగర్, మెట్టు వంశీ, మెట్టు శేఖర్, చేపూరి నాగరాజు, బలగం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో పాటు పదవీ విరమణ పొందిన ఆర్ఐ బద్ది దాసు ను సన్మానించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

