రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి, జూలై 20:
భువనగిరి పట్టణంలోని లోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నాయకులు మాయ కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు మండల విద్యాశాఖ అధికారి (MEO)కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాయ కృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదుల మరమ్మతులు, విద్యుత్, ఫ్యాన్లు, బెంచీలు, పరిశుభ్రత వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు తదితర సౌకర్యాలను ప్రభుత్వం వెంటనే అందించాలని కోరారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన మండల విద్యాశాఖ అధికారి సమస్యలను పరిశీలించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ సెక్రటేరియట్ సభ్యులు గంధమల్ల మాతయ్య, సిపిఎం పట్టణనాయకులు బర్ల వెంకటేష్ ఈర్ల రాహుల్, మన్నె రాజు కార్యకర్తలు పాల్గొన్నారు.
