బోనాల ఉత్సవాలకు చెక్కుల పంపిణీప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డితో పాటు పాల్గొన్న కె ఎల్ ఆర్ …. తె లంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు ప్రతీక: కిచ్చెన్న

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 1/GHMC డివిజన్ జిల్లెలగూడ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బోనాల ఉత్సవాల చెక్కులను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డితో కలిసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.. ఆలయ కమిటీలకు అందజేశారు.

ఈ సందర్భంగా KLR మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అమ్మవారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రూ. 17.50 లక్షలకు పైగా సీఎం రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు.

భవిష్యత్ తరాలకు బోనాల ఉత్సవాల గురించి తెలిసేలా ప్రతీ ఆడబిడ్డ కృషి చేయాలని.. ఆలయాల కమిటీలు సమన్వయం చేసుకోవాలని లక్ష్మారెడ్డి సూచించారు.

బోనాల పండుగ ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఆలయాలు పరిశీలన చేయాలని కిచ్చెన్నగారు కోరారు.

అంతకుముందు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ యువ సేన ఆధ్వర్యంలో సీడీ ఆవిష్కరించారు

📄 Generate e-Paper Clip
Share This Article