గిన్నిస్ విజేతలను ప్రోత్సహించాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజేతలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా సన్మానం

1 Min Read

నాచారం టీంమాస్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిభ చాటిన విద్యార్థులు

  • బి. మోహన్ కుమారుడు బి. రాము సహా పలువురికి సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం
  • ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న యువతను ప్రభుత్వం ప్రోత్సహించాలంటూ ఎమ్మెల్యే డిమాండ్

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, జూలై 20: ప్రపంచ స్థాయిలో తెలంగాణ ప్రతిష్ఠను చాటిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ విజేతలను ప్రభుత్వం గుర్తించి తగిన ప్రోత్సాహకాలు అందించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో విజయం సాధించిన విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి అభినందించారు.

ఈ ఏడాది ఏప్రిల్ 26న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో నాచారం టీం మాస్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బి.మోహన్ కుమారుడు బి.రాము బి.గట్టు, బి.భరత్, బి.చెన్నమ్మ, జే.కృత్విక్, బి.యక్షిత్ వర్ధన్, శివచరణ్, శివకుమార్, మాణితేజ ఈ పోటిల్లో పాల్గొని విజయాన్ని నమోదు చేశారు. కార్యక్రమం అనంతరం 45 రోజుల తర్వాత వారికి గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందాయి.

ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి ఘనంగా సన్మానించారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకొస్తున్న యువతను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి నగదు ప్రోత్సాహకాలు, అవార్డులు, శిక్షణ అవకాశాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించడం ద్వారా మరింత మంది యువతలో స్ఫూర్తి నింపవచ్చని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article