ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల గోస – ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి:కప్పాటి పాండురంగా రెడ్డి.

Fasiuddin Mohammed
1 Min Read

(రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం మే 22:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పటి.పాండురంగారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్నప్పటికీ,క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్,టిఆర్ఎస్ నాయకులు కప్పాటి పాండురంగా రెడ్డి విమర్శించారు.రైతులు తమ పంటను అమ్ముకోవడానికి రోజులు తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నా,సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు.జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో 50 శాతం కూడా కొనుగోలు చేయలేదని తెలిపారు.ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాల పేరుతో ఆరబెట్టిన ధాన్యానికీ ‘తేమ ఎక్కువ’అని సాకులు చెబుతూ, క్వింటాలుకు 5 నుండి 8 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.కొనుగోలు కేంద్రాల వద్ద త్రాగునీరు,నీడ వంటి కనీస సౌకర్యాలు లేక రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవని విమర్శించారు.ధాన్యం విక్రయించినా రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడు జమవుతాయో తెలియక అయోమయం నెలకొంది.ఈ పరిస్థితుల వల్ల తదుపరి సాగు కోసం రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు.సన్న రకం వరి పండించిన రైతులకు క్వింటాకు రూ. 500 బోనస్‌ను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి గన్నీ బ్యాగులు సరఫరా చేయడంతో పాటు,తేమ శాతం పేరుతో రైతులను వేధిస్తున్న మిల్లర్లు,అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.ధాన్యం కొనుగోళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, లేకపోతే రైతుల తరఫున ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

📄 Generate e-Paper Clip
Share This Article
3 Comments
  • Hiya very nice site!! Man .. Excellent .. Superb ..
    I’ll bookmark your site and take the feeds also?
    I’m satisfied to find numerous useful info right here in the publish,
    we need work out more strategies in this regard, thanks for sharing.
    . . . . .

  • Exploratory modules аt OMT encourage imaginative analytical,
    helping trainees fіnd mathematics’ѕ creativity and гeally feel inspired fօr exam accomplishments.

    Experience flexible learning anytime, ɑnywhere through OMT’s
    comprehensive online e-learning platform, including endless access tߋ video
    lessons and interactive tests.

    Ӏn a system ԝhеre math education haѕ evolved t᧐ promote innovation ɑnd worldwide competitiveness, registering іn math tuition ensures traiinees
    remain ahead by deepening their understanding and application of
    crucial concepts.

    primary school math tuition boosts rational reasoning, crucial fοr interpreting PSLE concerns including sequences ɑnd logical deductions.

    Personalized math tuition іn senior һigh school addresses private learning voids іn subjects like calculus and stats, avoiding them fгom
    hindering O Level success.

    By providing comprehensive experiment ⲣast A Level exam
    papers, math tuition acquaints trainees ѡith concern formats
    and marking schemes fⲟr ideal efficiency.

    Uniquely,OMT’ѕ curriculum complements tһe MOE framework by offering modular
    lessons tһat permit duplicated reinforcement ⲟf weak
    aгeas at tһe trainee’ѕ speed.

    Gamified aspects mаke modification fun lor, encouraging mօre
    practice аnd rеsulting in grade enhancements.

    Вy including technology, οn the internet math tuition engages digital-native
    Singapore trainees f᧐r interactive exam revision.

    Feel free tօ visit mу blog; ip math tutor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *