భూ నిర్వాసితులకు నష్ట పరిహారం ఇచ్చిగందమల్ల రిజర్వాయర్ పనులు చేపట్టాలి..యండి.జహంగీర్ సీపీఎం జిల్లా కార్యదర్శి

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ప్రతినిది ఆగస్ట్ 19/ గంధ మల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసి ఏడాది గడిచిన ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదని ఇప్పటివరకు భూ నిర్వాసితులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి యండి. జహంగీర్ అన్నారు
ఈరోజు గందమల్ల రిజర్వాయర్ ను సిపిఎం నాయకత్వం పరిశీలించడం జరిగింది. ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతనలేదని హడావిడి ప్రకటనలు తప్ప
ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదని అన్నారు.
ఆలేరు ప్రాంతానికి నీరందించే కీలకమైన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి సమృద్ధిగా నిధులు విడుదల చేసి నిర్ణీత గడులోపు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల కు నిధుల సాధనకై ఈనెల 29 30 తేదీల్లో భువనగిరి నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ఆగస్టు 31 ఇందిరాపార్కు ముందు ధర్నా నిర్వహిస్తున్నామని నిర్వాసితులు,పేదలు, రైతాంగం అంతా రాజకీయాలకతీతంగా కదిలి రావాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటురి బాలరాజు మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్,జిల్లా నాయకులు బుర్రు అనిల్. పార్టీ మండల కమిటీ సభ్యులు కొక్కొండ లింగయ్య తలారి మాతయ్య గడ్డమీది నరసింహ తూటి వెంకటేశం ఆవుల కలమ్మ తదితరులు పాల్గొన్నారు

📄 Generate e-Paper Clip
Share This Article