రాయల్ పో స్ట్ న్యూస్ హైదరాబాద్, జూలై 16: మహానీయుల జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర స్థాయిలో బీజేపీ పార్టీ కో ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా సంత్ గురు రవిదాస్ జయంతి ఉత్సవాల కో ఆర్డినేషన్ కమిటీని ఆ పార్టీ ప్రకటించింది. ఉత్సవ కమిటీ కన్వీనర్ గా నల్గొండ జిల్లాకు చెందిన మాస శ్రీనివాస్, జాయింట్ కన్వీనర్ గా హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు చెందిన మానేకర్ చంద్రుబాబాను నియమిస్తూ పార్టీ ఆధిష్టానం ఆదేశాలు జారి చేసింది. ఈ సందర్భంగా గురువారం బర్కత్ పుర లోని బీజేపీ నగర కార్యాలయంలో జాయింట్ కన్వీనర్ మానేకర్ చంద్రుబాబా మాట్లాడుతూ… సమాజంలో ఎంతటి దుర్మార్గుడైనా సంత్సంగ ప్రభావంతో సజ్జనుడవుతాడని విశ్వసించిన మహానీయుడు సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ అని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి మహానీయుడి చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
