రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 19/ పట్టణ ప్రజల భద్రత దృష్ట్యా భువనగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో కోతులను పట్టే కార్యక్రమం బుధవారం రోజున మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ పర్యవేక్షణలో ప్రారంభించబడింది.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, పట్టణంలోని కోతుల బెడద ఎక్కువగా ఉందని ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఇట్టి కోతులను సురక్షితంగా పట్టి, అటవీ ప్రాంతంలోకి తరలించే చర్యలు చేపట్టారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అదికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ కె. చంద్ర ప్రకాష్ రెడ్డి , శానిటరి ఇన్స్ పెక్టర్ , మున్సిపల్ సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
