రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 15//యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు కార్యాలయం, భువనగిరిలో జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ అధ్యక్షతన జిల్లా నేరాల సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు, శాంతిభద్రతలు, సైబర్ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ భద్రత, సాంకేతిక వనరుల వినియోగం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యతతో కూడిన విచారణ జరిపి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేరాల నివారణలో భాగంగా Visible Policing ను మరింత బలోపేతం చేయడంతో పాటు, గ్రామస్థాయిలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేసి నేరాలను ముందుగానే అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Samanvai Portal మరియు CEIR Portalలను సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని తెలిపారు. అలాగే Law & Order, CCS, Cyber Cell, IT Cellల మధ్య సమన్వయాన్ని మరింత పెంచి కేసుల ఛేదనను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని, ప్రమాదాల నివారణకు ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై చైతన్యం కల్పించాలని సూచించారు. గ్రామాల వారీగా CCTV కెమెరా నెట్‌వర్క్ విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.
అదేవిధంగా పెట్రోలింగ్, నాకాబందీ, వాహన తనిఖీలను మరింత సమర్థవంతంగా నిర్వహించి నేరస్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, సైబర్ నేరాల నివారణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన మరియు నాణ్యమైన పోలీసు సేవలు అందించడం ప్రతి పోలీసు అధికార బాధ్యత అని పేర్కొన్న జిల్లా ఎస్పీ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా అంకితభావంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, సీసీఎస్, సైబర్ సెల్, ఐటీ సెల్ మరియు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.