రుద్రంగి ఆగస్టు16 రాయల్ పోస్ట్ న్యూస్ /

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలోని గడ్డం గంగపుత్ర సంఘ సభ్యులు తమ సంఘానికి బోర్ మోటార్ కావాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కోరడం జరిగిందని వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బోర్ మోటార్ మంజూరు చేయడం జరిగిందని అట్టి ప్రొసీడింగ్ కాపీని ఈ రోజు స్థానిక సర్పంచ్ గండి నారాయణ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య, గంగపుత్ర సంఘ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.కుల సంఘాల అభివృద్ధి కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిధులు మంజూరు చేస్తూ కుల సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నారని అన్నారు.గడ్డం గంగపుత్ర సంఘం సభ్యులు తమ సంఘానికి బోర్ మోటార్ అవసరమని చెప్పిన వెంటనే నూతన బోర్ మోటార్ మంజూరు చేయడం జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తూ సంఘ సభ్యులం ఎల్లవేళలా ఋణపడి ఉంటామని ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో,ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,మాజీ జడ్పిటిసి గట్ల మీనయ్య,ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి,వార్డు మెంబర్,అంబటి శ్రీనివాస్,శీలం మీనయ్య,ఎస్సి సెల్ అధ్యక్షుడు దయ్యాల శ్రీనివాస్,గడ్డం శ్రీనివాస్,తర్రె లింగం,తర్రె మనోహర్, కొమిరె శంకర్,పల్లి గంగాధర్,
దేశావేణి భూమేష్,పుదరి ప్రశాంత్, పాల్గొన్నారు..