మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఓసీ జేఏసీ నేతల పరామర్శ….

Fasiuddin Mohammed
1 Min Read

హనుమకొండ, ఆగస్టు 07 రాయల్ పోస్ట్ న్యూస్ /

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓసీ జేఏసీ రాష్ట్ర నాయకులు శుక్రవారం పరామర్శించారు. నల్లబెల్లి గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లిన ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్‌తో కలిసి టీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఓసీ జేఏసీ రాష్ట్ర కోశాధికారి లయన్ డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వర్ రావు ఇతర నాయకులతో కలిసి పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన సతీమణి స్వప్నతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇంత చిన్న వయసులో ఆయన మరణించడం రాష్ట్రానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ముందుకు సాగాలని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article