భువనగిరి క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ క్రీడోత్సవం.. బిలియర్డ్స్ బెస్ట్ ప్లేయర్ గా జావీద్ ఖాద్రి

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 15/
భువనగిరి (యాదాద్రి భువనగిరి):
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరి పట్టణంలోని భువనగిరి క్లబ్‌లో క్రీడా పోటీలను ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. పలు క్రీడల్లో క్లబ్ సభ్యులు, క్రీడాకారులు పోటీపడి తమ ప్రతిభను చాటుకున్నారు.

ఈ పోటీల్లో భాగంగా నిర్వహించిన బిలియర్డ్స్ (Billiards) సీనియర్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సయ్యేద్ . జావేద్ ఖాద్రి ‘బెస్ట్ ప్లేయర్’ బహుమతిని కైవసం చేసుకున్నారు. విజేతగా నిలిచిన ఎం.డి. జాయేద్‌కి గద్దె నరసింహ చేతుల మీదుగా బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు వినోద్ కుమార్, బిసు సత్యనారాయణ, బొబ్బిలి ఉమామహేశ్వర్, విజయ్ కుమార్, కౌసర్,, ఎం డి జహంగీర్, విఖార్ ఆమెర్, పూస ఆంజనేయులు (ఆంజన్) మరియు క్లబ్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.

📄 Generate e-Paper Clip
Share This Article