రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 15/ తేది :15-08-2026 శనివారం రోజున జనగామ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆవరణలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ఇవ్వడం జరిగింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మకoచ, జనగామలో పనిచేస్తున్న లెక్చరర్ మరియు జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) ప్రోగ్రాం ఆఫీసర్ మరిపెల్ల రవి ప్రసాద్ కి జనగామ జిల్లా స్థాయి ఎన్ఎస్ఎస్ ఉత్తమ ప్రోగ్రాం ఆఫీసర్ గా ఎంపికై జిల్లా కలెక్టర్ మరియు ప్రభుత్వ విప్ ఆలేరు ఎం ఎల్ ఏ శ్రీ బీర్ల ఐలయ్య చేతుల మీదుగా సన్మానం మరియు ప్రశంసా పత్రం అందుకోవడం జరిగింది.


మరిపెల్ల రవిప్రసాద్ గత మూడు సంవత్సరాలుగా ఎన్ ఎస్ ఎస్ ద్వారా రెగ్యులర్ కార్యకలాపాల ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లు, క్లీన్ & గ్రీన్, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, యూత్ లీడర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ల కోసం వాలంటీర్లను పంపడం, మొక్కలు నాటడం, ఎయిడ్స్ ర్యాలీలు, వనమహోత్సవ ర్యాలీ, సద్భావన ర్యాలీ, ఓటర్ అవగాహన ర్యాలీ, ర్యాగింగ్ వ్యతిరేక ర్యాలీలు, పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ మరియు కోవిడ్-19, యూత్ ఫెస్టివల్స్, జాతీయ సమైక్యతా దినోత్సవం, మేడారం జాతర క్యాంపుని విజయవంతంగా నిర్వహించడంతో ఈ ఉత్తమ సేవా పురస్కారం లభించిందని ఆయన తెలిపారు.
జనగామ జిల్లా స్థాయిలో ఉత్తమ ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా అవార్డు పొందినందుకు మరిపెల్ల రవిప్రసాద్ కి కాకతీయ యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ ఈసం నారాయణ గారు, డి ఐ ఇ ఓ జితేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి, సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ రేణికుoట్ల ప్రవీణ్ కుమార్, డాక్టర్ వస్కుల శ్రీనివాస్ మరియు కళాశాల అధ్యాపకులు, వాలంటీర్స్ అభినందనలు తెలిపారు.