గీతన్నల చైతన్యయాత్ర నుజయప్రదం చేయండి..

Fasiuddin Mohammed
2 Min Read
oplus_65552

మానుకోట నుండి ట్యాంక్ బండ్ హైదరాబాద్ వరకు
ఆగస్టు 2 నుండి 18 వరకు

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 9/ తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకమైన బస్సు యాత్ర 2016 ఆగస్టు 1 నుండి 10 వరకు ఖిలాషాపురం కోట నుండి గోల్కొండ కోటకు విజయవంతంగా నిర్వహించాము. సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించి ట్యాంకుబండ్ పై విగ్రహం ప్రతిష్టించాలని మరియు నూతన కల్లు విధానం రూపొందించి తక్షణ సమస్యలు పరిష్కరించాలని ఉద్యమించాము. | పెద్ద ఎత్తున సాగిన ఈ యాత్రలో గీత కార్మికులు, అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. నాటి శాసనమండలి చైర్మన్ కనక మామిడి స్వామి గౌడ్ గారు జండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర గీత కార్మికులలో చైతన్యం రగిలించి ప్రభుత్వంలో కదలిక తీసుకువచ్చింది.

ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక విజయాలు సాగించాం. వాటిని యాది చేసుకొని, కల్లుగీత వృత్తిలో ప్రమాదాల నివారణ, వన రక్షణ, ఉపాధి, సంక్షేమం ఆధునీకరణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి 2026 ఆగస్టు 2 నుండి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహిస్తున్నాము. మహబూబాబాద్ నుండి ప్రారంభమై అన్ని జిల్లాలు తిరుగుతూ | హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి తాటి ఈత వృక్ష సంపదను ప్రకృతి మనకు ప్రసాదించింది. వీటిపై ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తిలో మార్పులు తీసుకువచ్చి గీత కార్మికుల ఉపాధి మెరుగుపర్చాలి. వృత్తిలో జరుగుతున్న ప్రమాదాలను నివారించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో మనకు ఇచ్చిన హామీలు పెన్షన్ 4000 లు, ఎక్సిగ్రేషియా 10 లక్షలకు పెంచడం, చెట్ల పెంపకానికి భూమి తదితర అమలు చేయాలని ఈ సందర్భంగా అడుగుదాం.

మన కోసం పోరాడి అమరులైన కామ్రేడ్ ధర్మ బిక్షం, ఎస్ ఆర్ దాట్ల, దేశిని చిన్న మల్లయ్య, తొట్ల మల్సూర్, బైరు | మల్లయ్య, వడ్డెల్లి బుచ్చి రాములు, పెరుమాండ్ల జగన్నాథం, బొలగాని పుల్లయ్య లాంటి ఎందరో త్యాగమూర్తులను యాది చేసుకుందాం.

📄 Generate e-Paper Clip
Share This Article