వలిగొండ ఆగస్టు13 రాయల్ పోస్ట్ న్యూస్ //
ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గంధమల్ల బాలయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా గురువారం ఆయన స్వగ్రామం లింగరాజుపల్లిలో దశదినకర్మ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఉద్యమకారుల ఫోరం నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి మాట్లాడుతూ గంధ మల్ల బాలయ్య ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యమకారుల ఫోరం ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చేవాడని ఆయన స్ఫూర్తితో ఉద్యమకారుల హక్కులు సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్, బీసి సంఘం అధ్యక్షుడు సాయిని యాదగిరి, ఉద్యమకారుల ఫోరం నాయకులు బొడిగెసుదర్శన్, ఫోరం జిల్లా నాయకులు బొడ్డుపల్లి లింగయ్య, కదిరేని స్వామి, రామన్నపేట ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు నోముల శంకర్ ,కొండూరు సత్తయ్య, నీలమ్మ, ఎదురుగట్ల యాదగిరి, పల్లెర్ల రామచందర్, సందయ్య,లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
