రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 5/ పేదల పక్షాన పోరాడిన సిపిఎం సీనియర్ నాయకుడు అమరజీవి కామ్రేడ్ రాసాల వెంకటేశం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆగస్టు ఆరవ తేదీన బసవపురంలో నిర్వహించే స్థూపావిష్కరణ కార్యక్రమాన్ని బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య లు కోరారు. మంగళవారం రాత్రి ఆవిష్కరణ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ రాశాల వెంకటేశం సిపిఎం పార్టీలో సీనియర్ నాయకుడిగా గ్రామ సర్పంచ్ గా, రైతు సంఘం డివిజన్ కార్యదర్శిగా పనిచేసే ఎన్నో ఉద్యమాలు చేశారని ఆయన సేవలను కొనియాడారు. ముఖ్యంగా బస్వాపురం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలని, భూములు కోల్పోయిన వారికి మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, ఇండ్ల స్థలాలు పునరావసం కోసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ దక్కాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ధర్నాలు రాస్తారోకాలు నిర్వహించినట్లు తెలిపారు. పేదలకు ఇంట్ల స్థలాలు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ప్రభుత్వ భూమి సీలింగ్ భూములు పై పోరాటాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని, సాగునీరు ఎరువులు విత్తనాలు కరెంటు సమస్యలపై రైతుల పక్షాన పోరాటం చేశారని, ఐకెపి మార్కెట్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం మద్దతు ధర సకాలంలో ఇవ్వాలని, గ్రామంలో ఏ సమస్య వచ్చినా నేనున్నానని ఆ కుటుంబానికి అండగా ఉండి తగాదులు లేకుండా చేసిన ప్రజా నాయకుడు కామ్రేడ్ వెంకటేష్ అని అన్నారు. బస్వాపురం సర్పంచ్ గా అన్ని వార్డులో సిసి రోడ్లు మురికి కాలువలు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి గ్రామ సమగ్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని, ఆయన మన నుండి భౌతికంగా దూరమై సంవత్సరం కావస్తున్న ఆయన పోరాటాలు ఆశయాల కోసం గురువారం గ్రామంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇస్తూపు ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏం డి జహంగీర్ లు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ, మండల కమిటీ సభ్యులు మద్దె పురం బాల నరసింహ, గ్రామ శాఖ కార్యదర్శి మచ్చ భాస్కర్, సహాయ కార్యదర్శి రసాల దేవేందర్, సిపిఎం నాయకులు నరాల చంద్రయ్య, ముదిగొండ కృష్ణ, ఉడుత వెంకటేష్, మచ్చ శ్రీశైలం లు పాల్గొన్నారు.
