వలిగొండ ఆగస్టు12 రాయల్ పోస్ట్ న్యూస్ /
మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో వెలువర్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు15న నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి చౌటుప్పల్ డిఎస్పి మధుసూదన్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వెలువర్తి యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కూచిమల్ల సుధాకర్ మాట్లాడుతూ రక్తదాన శిబిరాన్ని యాదాద్రి తలసేమియా బ్లడ్ సెంటర్ మరియు యశోద హాస్పిటల్ డాక్టర్లచే హెల్త్ చెకప్ సదన్ ఐస్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వెలువర్తి యూత్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లం నరేష్, బూడిద రాజు, ప్రధాన కార్యదర్శి కూచిమల్ల నాగేష్, కోశాధికారి మల్లం సాయి, కార్యదర్శి మల్లం మహేష్, కలుకూరి విక్రమ్, కలుకూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
