రాయల్ పోస్ట్ న్యూస్ ఉప్పల్ ఆగస్ట్ 9/ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను సందర్శించారు.


ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
బోనాలు కేవలం అమ్మవారికి సమర్పించే నైవేద్యం మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, భక్తి విశ్వాసాలకు, తరతరాలుగా కొనసాగుతున్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పోతరాజుల వీరత్వం, డప్పుల దరువులు, అమ్మవారి ఘటాల ఊరేగింపులు, ఆడపడుచుల భక్తిశ్రద్ధలు తెలంగాణ జీవన సంస్కృతికి సజీవ రూపాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మన సంస్కృతి, భాష, యాస, పండుగలు ప్రజలను ఏకం చేసిన శక్తిగా నిలిచాయని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఆలయాల వద్ద భక్తులను కలిసి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడపడుచులందరికీ, ప్రజలందరికీ బోనాల పండుగ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలను అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.