ఏఐతో వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు

Fasiuddin Mohammed
1 Min Read

హైదరాబాద్, ఆగస్టు 08 రాయల్ పోస్ట్ న్యూస్ /: వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) తో విప్లవాత్మక మార్పులు వచ్చాయని జాతీయ ఆరోగ్య సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం కాచిగూడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో బ్లిస్ బర్గ్ ప్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి అజయ్ మిశ్రా, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, ప్రముఖ వైద్యుడు హరికుమార్ తదితరులు హాజరై ప్రసంగించారు. వేగవంతమైన చికిత్సా విధానాల రూపకల్పన, అధునాతనర స్కానింగ్ విశ్లేషణ, రోబోటిక్ సర్జరీ తదితరాల్లో ఏఐని వినియోగిస్తున్నారని తెలిపారు. దీనితో భవిష్యత్తులో మరిన్ని విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article