కాలనీలా అభివృద్ధిలో సంక్షేమ సంఘం పాత్ర ఎంతో కీలకం సబితా ఇంద్రారెడ్డి

Fasiuddin Mohammed
2 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం ఆగస్ట్ 9/ R K పురం డివిజన్ లో నీ అల్కాపురి కాలనీ అసోసియేషన్ వారు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రివర్యులు డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి.సబితా ఇంద్రారెడ్డి

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ :- కాలనీల అభివృద్ధికి ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నప్పటికీ కాలనీ సంక్షేమ సంఘం ముందుకు వచ్చి అభివృద్ధి పనులలో అధికారులకు సూచనలు ఇచ్చి కాలనీలకు కావలసిన సదుపాయాలను దగ్గరుండి చూసుకుంటే భవిష్యత్తులో కాలనీలకు ఎలాంటి సమస్య లేకుండా ఎక్కువ కాలం మన్నిక తో ఉంటాయన్నారు. పలు కాలనీ సంక్షేమ సంఘం వారు తమ దృష్టికి సమస్యలు, సీసీ కెమెరాలు కావాలని అడిగారని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి నెల లోనే పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు . అల్కాపురి కమిటీ హాల్ కు ఏసి ఏర్పాటు చేసుకుందామని అన్నారు. ఏసి ఏర్పాటు చేసుకుంటే చిన్నచిన్న ఫంక్షన్లు కూడా చేసుకోవచ్చని, ఫంక్షన్ లు చేసుకోవడం వల్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్థికంగా బలపడుతుందని అన్నారు. ఆర్కే పురం డివిజన్లో ఉన్న టెంపుల్స్ మరి ఎక్కడ లేవని ,అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ ప్రాంతంతో తనకు గత 12 సంవత్సరాలుగా అనుబంధం ఉన్నదని, తాను అధికారంలో లేకున్నా తనను ఆదరించారని పేర్కొన్నారు. ఏ సమస్య ఉన్న తనను సంప్రదిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన అల్కాపురి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు.
రాబోయేది కెసిఆర్ ప్రభుత్వమే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, సెక్రటరీ కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వీరేందర్, జాయింట్ సెక్రెటరీ సైదారావు, ట్రెజరర్ కృష్ణయ్య, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, నియోజకవర్గ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ , డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, గొడుగు శ్రీనివాస్, కొండ్ర శ్రీనివాస్, సాజిద్, కంచర్ల శేఖర్, పెంబర్తి శ్రీనివాస్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు లిక్కి ఊర్మిళా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article