భువనగిరి మున్సిపాలిటీలో ఉద్యోగ విరమణ కార్యక్రమం..

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ జులై 2/ : భువనగిరి పురపాలక సంఘ కార్యాలయంలో 61 సంవత్సరాల వయస్సు నిండి పదవీ విరమణ చేసిన ఇద్దరు ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.

పబ్లిక్ హెల్త్ వర్కర్ శ్రీమతి సల్ల జయలక్ష్మి మరియు NMR టైమ్ స్కేల్ ఉద్యోగి పొట్ట జగన్ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ వారిని శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, “జయలక్ష్మి , జగన్ మున్సిపాలిటీకి ఎనలేని సేవలు అందించారు. వారి అంకితభావం, క్రమశిక్షణ యువ ఉద్యోగులకు ఆదర్శం. పదవీ విరమణ తర్వాత కూడా వారు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని” ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ శ్రీమతి పొతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు , మున్సిపల్ కమిషనర్ కే. చంద్రప్రకాష్రెడ్డి , ఇతర మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నా రు

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *