రాయల్ పోస్ట్ న్యూస్ కాచిగూడ, ఆగస్టు 07: ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే బోనాల వేడుకలతో పాటు రానున్న గణేష్ ఉత్సవాలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని చిక్కడపల్లి ఏసీపీ రణవీర్ రెడ్డి భక్తులకు, నిర్వహాకులకు సూచించారు. కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం బోనాల నిర్వాహాకులు, సెంట్రల్ ఫీస్ కమిటీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ… బోనాల ఉత్సవాల్లో.. ఫలహారపు బండ్ల ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా డీజే షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోనాల ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకునే విధంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ వీరకౌశిక్, సెంట్రల్ పీస్ కమిటీ సికింద్రాబాద్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. శరత్ శ్యామ్, రమేష్ యాదవ్, లడ్డూ యాదవ్, నందకిషోర్ యాదవ్, అబ్దుల్ కబీర్, యూసుఫ్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.
