కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుదాం– దోపిడి రైత సమాజం కోసం, కష్టజీవుల హక్కులకోసం పోరాడిన ప్రజానాయకుడు రాసాల వెంకటేశం– సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపు

Fasiuddin Mohammed
4 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 7/ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. సమావేశంలో కొనసాగుతున్న దోపిడి పోవాలని ఎర్రజెండా రాజ్యం రావాలని, ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ‌అమరజీవి కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారి ఆశయ సాధనలో కామ్రేడ్స్ అందరూ కృషి చేయాలని కోరారు.
గురువారం రాత్రి భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ కామ్రేడ్ రాసాల వెంకటేశం ప్రథమ వర్ధంతి సందర్భంగా గ్రామంలో నిర్మించిన స్మారక స్తూపాన్ని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎస్. వీరయ్య, జిల్లా కార్యదర్శి యండి. జహంగీర్ , కుటుంబ సభ్యులకు కలిసి జాన్ వెస్లీ ఆవిష్కరించిన అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నాయకత్వం వహించిన పరిపాలన కొనసాగిస్తున్న నరేంద్రమోడీ ఒక నియంతలాగా, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ఉన్నారని విమర్శించారు. నీట్ పరీక్షలో జరిగిన తప్పులపైన చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్న విద్యార్థులు, యువకులపైన నిర్బంధం కొనసాగిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ అనిచివేతకు గురి చేస్తూ విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందుల గురి చేస్తున్నారని విమర్శించారు. బిజెపి అనుసరిస్తున్న కార్పొరేట్ శక్తుల అకూల విధానాలకు వ్యతిరేకం , లేబర్ కోడ్లను, విబీజి గ్రామ్ జి చట్టాన్ని రద్దుచేయాలని, విద్యుత్ , విత్తన, జాతీయ ఆహార భద్రత చట్టాల సవరణలను విరమించుకోవాలని డిమాండ్ల సాధన కోసం ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చా. రాష్ట్రంలో ఆర్ గ్యారంటీల పేరుతో అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజురోజుకు విద్య, వైద్యం వ్యాపారంగా మారుస్తూ పేదలను విద్య , వైద్యానికి దూరం చేస్తున్నారు విమర్శించారు. ఎందుకు ఉచిత విద్య, వైద్యం ఇవ్వడం లేదో సమాధానం చెప్పాల్సిన డిమాండ్ చేశారు. ఇంకా పేదలు ఇండ్లు, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. సీపీఎం కేంద్ర సభ్యులు ఎస్. వీరయ్య మాట్లాడుతూ ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైన జనాన్ని చూస్తుంటే రాసాలం వెంకటేశం ప్రజల కోసం ఏ స్థాయిలో పనిచేసిన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే అన్నారు. ప్రపంచంలో ఎర్రజెండా నాయకత్వంలో పరిపాలన కొనసాగిస్తున్న అనేక చిన్న దేశాలు, ప్రపంచంలో అతిపెద్ద దేశంలో కూడా ప్రజలకు అన్ని రకాలైన సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, ఉండడానికి ఇల్లు, దున్నుకొని జీవించడానికి భూమి, కనీస సౌకర్యాలు కూడా పెద్ద ఎత్తున ఆ దేశంలో ప్రభుత్వ రంగంలో అందిస్తున్నారని తెలిపారు. కానీ ప్రపంచంలో రెండో దేశం ఉన్న మనదేశంలో దోపిడి తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని కార్పొరేట్ శక్తులకు అనుకూలం తప్ప పేదల సంక్షేమం మాత్రం ఈ ప్రభుత్వాలకు పాలకులకు పట్టడం లేదని విమర్శించారు. ఈ సమాజంలో కొనసాగుతున్న దోపిడి పోవాలన్న, హక్కులు పరిష్కారం కావాలన్నా ఎర్రజెండాతోనే సాధ్యమవుతుందని ప్రజలందరూ కూడా రానున్న కాలంలో ఎర్రజెండాను ఆదరించాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి యండి జహంగీర్ మాట్లాడుతూ కామ్రేడ్ వెంకటేశం బస్వాపురం ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన రైతుల పక్షాన, ముంపుకు గురైన వివిధ గ్రామాల ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాడాడని తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, గిట్టుబాటు ధర కోసం, మార్కెట్ సౌకర్యం కోసం అనేక ఉద్యమాలు చేపట్టారని అన్నారు. గ్రామ సర్పంచిగా రామా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని తెలియజేశారు. వారి స్ఫూర్తితో రానున్న కాలంలో ప్రజా పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, వెంకటేష్ కుమారుడు శ్రీకాంత్ పాల్గొని మాట్లాడగా ఈ కార్యక్రమానికి గ్రామ శాఖ కార్యదర్శి మచ్చ భాస్కర్ అధ్యక్షత వహించగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, కుటుంబ సభ్యులు గ్రామ మాజీ సర్పంచ్ రాసాల నిర్మల, శ్రీశైలం, గ్రామ సర్పంచ్ బిక్షపతి, గడ్డం వెంకటేష్ , మాయ కృష్ణ , అన్నంపట్ల కృష్ణ, మధ్యపురం బాల్ నరసింహ, బాబు, చంద్రయ్య, విష్ణు, దేవేందర్, కృష్ణ, రహిమాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాట్యమండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాటి ” వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ” చరిత్రను పల్లె సుద్దులను, కళారూపాలను ప్రదర్శించినారు.

📄 Generate e-Paper Clip
Share This Article