రాయల్ పోస్ట్ న్యూస్ గజ్వేల్, 08 జూలై 2026/మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ నాయకుడు నాయిని యాదగిరి. ఈ సందర్భంగా నాయిని యాదగిరి మాట్లాడుతూ మున్నూరు కాపు సమాజానికి మరియు రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి, ఇంతటి బాధ్యతాయుతమైన రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని అప్పగించిన పెద్దలకు, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మున్నూరు కాపు కులబంధువుల హక్కుల సాధన కోసం, వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక వృద్ధి కోసం నా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. సమాజంలో వెనుకబడిన మున్నూరు కాపు యువతకు విద్యా, ఉపాధి రంగాలలో సరైన అవకాశాలు లభించేలా సంఘం తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి, సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. గజ్వేల్ ప్రాంతానికి చెందిన వ్యక్తినైన నాకు ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక కులబంధువుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ మొదటి వరుసలో ఉంటానన్నారు. తనకు దక్కిన ఈ పదవి మున్నూరు కాపు సమాజానికి సేవ చేయడానికి లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని, అందరి సహకారంతో సంఘ కీర్తిని మరింత ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
