రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 8/పట్టణంలోని 23వ వార్డుకు చెందిన బుచ్చాల ఎల్లమ్మ అకాల మరణం పట్ల మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం మృతురాలి నివాసానికి వెళ్లిన వారు ఎల్లమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి దుఃఖంలో తాము భాగస్వాములమని పేర్కొంటూ కుటుంబానికి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎల్లమ్మ మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న వారు, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని వేడుకున్నారు. వారి వెంట వార్డు పెద్దలు బండారు రవి వర్ధన్ బుచ్చాల స్వామి మాజీ కౌన్సిలర్, భూషపాక యాదగిరి, గోపే బాబు, బర్రె క్రాంతి, బుచ్చాల అనిల్ కుమార్, నాగ రేఖ ఉన్నారు.

