రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి, డిసెంబరు ఆగస్ట్ 21/

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే పరమావధిగా ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటుకోవాలని భువనగిరి మున్సిపల్ పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత – జహంగీర్ పిలుపునిచ్చారు.
23వ వార్డుకు చెందిన బర్రె చంద్రమ్మ ఇటీవలే మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ పూజిత – జహంగీర్ శనివారం మృతురాలి నివాసానికి వెళ్ళి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రమ్మ కుటుంబానికి తమవంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేసి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర పుట్టెడు దుఃఖంలో ఉన్న నిరుపేద కుటుంబానికి తనవంతు సహాయం అందించడం బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో పేదలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారికి చేయూతనిచ్చేందుకు దాతలు, స్థానికులు ముందుకు రావాలని కోరారు. కష్టకాలంలో తమను పరామర్శించి, ఆర్థికంగా అండగా నిలిచిన కౌన్సిలర్ పూజిత – జహంగీర్‌కు చంద్రమ్మ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.