కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

పాపన్నపేట, 29 మే, రాయల్ పోస్ట్;

పాపన్నపేట మండలంలోని అర్హులైన 104 మంది లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద మొత్తం రూ.1,04,12,064 విలువైన చెక్కులను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
7 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *