రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 15/ భువనగిరి మండలం కేసారం గ్రామానికి చెందిన గౌరారం నాగరాజు గారి కుమారుడు హరిషిత్‌కు వైద్య చికిత్స నిమిత్తం రూ.7 లక్షల విలువైన LOC (Letter of Credit)ను భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అందజేశారు.
ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సకు ఇబ్బంది పడుతున్న కుటుంబానికి ప్రభుత్వం ద్వారా LOC మంజూరు చేయించి, హరిషిత్‌కు మెరుగైన వైద్యం అందేలా ఎమ్మెల్యే చొరవ తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.